కామంతో కళ్లుమూసుకుపోయిన భార్య.. భర్త ఎదుటే నగ్నంగా ప్రియుడితో శృంగారం.. ప్రశ్నించినందుకు కట్టుకున్నోడిని కడతేర్చిన ఇల్లాలుఅక్రమ సంబంధానికి అడ్డొచ్చాడన్న ఒకే ఒక్క అక్కసుతో పసుపుతాడు కట్టిన భర్తను ప్రియుడితో కలిసి పొట్టనపెట్టుకుందో కామాంధురాలు.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శక్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామశంకర్ మిశ్ర (42) ఎన్సీఎల్ బీనాలో సీనియర్ ఓవర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతని భార్య ప్రియాంక మిశ్ర (35) అదే ప్రాంతానికి చెందిన వికాస్ చౌహాన్ (25) అనే యువకుడితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయం చూసి ప్రియుడితో ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంది.గత నెల ఆగస్టు 22న ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన రామశంకర్ కళ్లకు భార్య బాగోతం అడ్డంగా దొరికిపోయింది. గదిలో ప్రియాంక, వికాస్ నగ్నంగా, అభ్యంతకర భంగిమలో ఉండటాన్ని రామశంకర్ కళ్లారా చూశాడు. క్షణికావేశంలో రగిలిపోయిన భర్త, తన భార్యను గట్టిగా నిలదీయడంతో పాటు వికాస్‌తో తీవ్ర వాగ్వాదానికి, గొడవకు దిగాడు. తమ అక్రమ సంబంధానికి భర్త ఎప్పటికీ సమస్యేనని భావించిన ఆ ఇద్దరూ రాక్షసులుగా మారిపోయారు. విచక్షణ కోల్పోయిన ప్రియాంక, వికాస్‌లు కలిసి రామశంకర్పైకి దూసుకెళ్లారు. విరుచుకుపడి ఆయన గొంతు నులిమి, తలను నేలకేసి బలంగా కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. ప్రాణాలు పోయాయని గ్రహించిన తర్వాత ఈ దారుణాన్ని ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు పెద్ద పన్నాగం పన్నారు. వికాస్ తన స్నేహితులు అనురాగ్, సోనుల సాయాన్ని తీసుకున్నాడు. అందరూ కలిసి రామశంకర్ మృతదేహాన్ని రహదారి పక్కన పడేశారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాలు పరిశీలించగా ఇది ప్రమాదం కాదని, భార్యే ప్రియుడితో కలిసి పన్నిన హత్యగా తేలింది. దీంతో పోలీసులు ప్రధాన నిందితురాలైన భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు వికాస్‌తో పాటు కుట్రకు సహకరించిన అనురాగ్, సోనులను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. క్షణికావేశంలో కామంతో కళ్లుమూసుకుపోయి చేసిన ఈ ఘాతుకం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: