దువ్వూరు:వి.బి.జి. రామ్జీ పథకం కింద దువ్వూరు చెరువులో జరుగుతున్న ఫిష్ పాండ్ పనులను బుధవారం ఉదయం ఎంపీడీవో శ్రీ సి.ఏ. జవహర్ బాబు పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల్లో పాల్గొంటున్న మదిరేపల్లి గ్రామ కూలీలతో ఎంపీడీవో మాట్లాడారు. కొలతల ప్రకారం పని పూర్తి చేస్తే రోజుకు రూ.312 వరకు కూలి లభిస్తుందని తెలిపారు.అలాగే కూలీలు పనికి హాజరయ్యే సమయంలో ఒకసారి, పని ముగించే సమయంలో మరోసారి.. నాలుగు గంటల వ్యవధిలో తప్పనిసరిగా ఫొటోలు తీయించుకోవాలని సూచించారు. పనులకు సంబంధించిన హాజరు, కొలతలు తదితర వివరాల్లో పారదర్శకత కోసం ఈ విధానం పాటించాలని తెలిపారు.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే వి.బి.జి. రామ్జీ పథకం కింద అందుబాటులో ఉన్న పనులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: