తాళ్లమాపురం ఎస్సీ కాలనీ ఘటనపై తక్షణ విచారణ చేపట్టాలి
బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి: అనపురెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి
ప్రొద్దుటూరు /తాళ్లమాపురం ఎస్సీ కాలనీ ప్రవేశద్వారం వద్ద జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కడప జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి అనపురెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు లేదా ఇతరుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశంపై విచారణ జరిపి, బాధ్యత నిర్ధారణ అయిన పక్షంలో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.స్థానిక ఎంఆర్‌ఓ, పంచాయతీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ఘటనపై పూర్తి వివరాలను సేకరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు..అలాగే కడప జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి, బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అనపురెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: