కడప /దువ్వూరు, సెప్టెంబర్ 17: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దువ్వూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో గురువారం ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ పాలనకు సంబంధించి 25 దీపాలను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దేశానికి మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవేటి హరికృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి, మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు బ్రహ్మచారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బాలనాగిరెడ్డి, శ్రీనివాసులు, నరేంద్ర రాయల్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: