మాదక ద్రవ్యాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

పోరుమామిళ్ల: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. పోరుమామిళ్లలోని సాయిరాం కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కళాశాల కరస్పాండెంట్ కేశవరెడ్డి, ప్రిన్సిపాల్ సత్యనారాయణ నేతృత్వంలో, సేవా సంకల్ప్ అభియాన్ బద్వేల్ నియోజకవర్గ కన్వీనర్, కడప జిల్లా ఓబీసీ కార్యదర్శి మున్నెల్లి చిన్నగురయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథులుగా పోరుమామిళ్ల సీఐ సుబ్రమణ్యం, బద్వేల్ ఏఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు.
అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నారోజు రమణచారి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో పోరుమామిళ్ల బీజేపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర, బద్వేల్ అసెంబ్లీ కో-కన్వీనర్ పల్లంశెట్టి పండారి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తమ్మిశెట్టి రమణ, ఉపాధ్యక్షుడు చెన్నయ్య, పోకల బ్రహ్మయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *