ప్రొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చి ప్రజల సమస్యలని వివరించిన డేవిడ్ రాజు

ప్రొద్దుటూరు: కొత్తపల్లి గ్రామ వీఆర్వో రామయ్యపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, తప్పులు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు పాలాజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్‌లు డిప్యూటీ తహసీల్దార్ ఏకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. కొత్తపల్లి పరిధిలోని ప్రభుత్వ చుక్కల భూములు, డీకేటీ భూములు, దేవాదాయ భూములు, కుంటలు, కాలువలకు సంబంధించిన భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.
ప్రభుత్వ భూములు అక్రమంగా ఇతరుల ఆధీనంలోకి వెళ్లి ఉంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శులు సుమన్, జాషువా, దస్తగిరి, లక్ష్మీప్రియ సుజాత, దస్తగిరమ్మ, హుస్సేన్, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *