లింగాల : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి మరొకరికి తీవ్ర గాయాలు. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడు తెలంగాణలోని భద్రాచలం మునుగోడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు, బ్రతుకుతెరువు కోసం విద్యుత్ మరమ్మతులు పనిచేయడానికి గత నాలుగు సంవత్సరాల నుండి విద్యుత్ కాంట్రాక్టర్ రమణారెడ్డి దగ్గర కూలీగా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ అధికారులను నిర్లక్ష్యంతో ప్రమాదానికి గురై సాగర్ అనే యువకుడు మృతి చెందాడు, లక్ష్మణ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో కడప రిమ్స్ తరలించారు. లింగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

previous post
next post