ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ఆప్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌లను వెంటనే విడుదల చేయాలని, ప్రతిపక్షాల ఆర్థిక బలహీనతను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈసీని కోరారు.

previous post