Tv424x7
Cinima News

చిన్నసింగనపల్లెలో రేపటి నుంచి మూడు రోజులు శ్రీ పోతురాజు, శ్రీ మల్లెలమ్మ తల్లి, శ్రీ భైరవ కొండయ్య స్వామి ప్రతిష్ట మహోత్సవం

కడప /దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో బుధవారం నుంచి అనగా 3 ,4,5 తేదీలలో శ్రీ పోతురాజు, శ్రీ మల్లెలమ్మ తల్లి, సహిత శ్రీ శ్రీ భైరవ కొండయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ పెద్దలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ బుధవారం మూడో తారీకు ఉదయం 8 గంటలకు గణపతి పూజ రక్త బంధం యాగశాల ప్రవేశం ప్రధాన కలశ స్థాపనం, అఖండ దీపారాధన, యంత్రములకు అభిషేకము, మంగళహారతి,మంత్రపుష్పం, తీర్థప్రసాద్ వినియోగము, సాయంత్రం ఐదు గంటలకు ప్రదోషకాల పూజ,అంకురారోహణం, ప్రధానకలశ,ఆవహనము నవగ్రహ, వాస్తు మండల ఆరాధన, ఆగ్నిప్రతిష్ఠ, దీక్షావమములు, మంగళహారతి వేద స్వస్తి. నాలుగవ తేదీ గురువారం ఉదయం ప్రాత: కాలపూజ, యంత్రములకు అభిషేకం జపములు వాస్తు రుద్రాస్పాహాకార – నవగ్రహ, ఆవాహన దేవత హొమములు, గ్రామోత్సవం, మంగళ హారతి తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం ప్రదోష కాల పూజ దీక్ష హోమం- ధాన్యాసయ్యా, తల పుష్ప ఆదివాసములు, మంగళహారతి, వేద స్వస్తి. 5వ తేదీ శుక్రవారం ఉదయాత్ పూర్వం ,గర్త పూజ, ఉదయం 6-45 నిమిషాల నుండి యంత్ర విగ్రహప్రతిష్ట కలాన్యాసం ప్రాణ ప్రతిష్ట కలశ ఉధ్వసన, మహత్ ఆశీర్వచనం వంటి కార్యక్రమాలు వేద పండితులచే జరుపబడునని కమిటీ సభ్యులు తెలిపారు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు కావున మూడు రోజులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు విగ్రహ ప్రతిష్ట ఆహ్వానంలో పాల్గొనవలసిందిగా తెలిపారు

Related posts

తొలి సినిమా షూటింగ్ కు ముంబై వెళ్లిన నీలి కళ్ళ మోనాలిసా

TV4-24X7 News

దేవర ఓటీటీ రిలీజ్ అప్‌డేట్.. అప్పటివరకూ ఆగాల్సిందే

TV4-24X7 News

గుడివాడ రౌడి గా నటించిన నటుడు శ్రీ మోహన్ రాజ్ అనారోగ్యంతో మృతి

TV4-24X7 News

Leave a Comment