Tv424x7
Telangana

కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్‌

నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్నారు ఎంపీ బండి సంజయ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించారు..అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం జరుగుతుందన్నారు.ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో ‘రైతు దీక్ష’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు..

Related posts

సెప్టెంబర్ 17న ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం

TV4-24X7 News

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

TV4-24X7 News

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

TV4-24X7 News

Leave a Comment