Tv424x7
Andhrapradesh

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలసిన దాసుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

న్యూస్ తాడేపల్లి:-ఆంధ్రప్రదేశ (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అఖిలభారత దాసుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యామర్తి ధనుంజయ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలలో మూడవ స్థానం జనాభా కలిగి ఏ గుర్తింపు లేకుండా ఉన్నటువంటి జాతిని గుర్తించాలని తమ జాతిలో హరిదాసు కళాకారులకు కళాకారుల పెన్షన్ వచ్చేలా కృషి చేయాలని. దళిత పురోహితుల కార్పొరేషన్, లేదా దాసుల కమ్యూనిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2007 నుండి దాసుల కాలనీలలో సొంత నిధులతో జరిపించే మంగళ కైశిక ద్వాదశి పండుగ బడ్జెట్ ఒక్కో సెంటర్ కు 25వేల రూపాయలకు పెంచాలని,మా కుల చరిత్ర ఆధారంగా దివంగత నేత మాజీ మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007నుండి టిడిపి సొంత నిధులతో జరిపిస్తున్నా బడ్జెట్ ప్రస్తుత పెరిగిన ఖర్చుల దృష్ట్యా పెంచాలని,మా కులానికి గుర్తించి ఒక mlc కేటాయించాలని,ప్రముఖ దేవాలయాల పాలక మండలి లో మా కుల సభ్యులకు అవకాశం కల్పించాలని,హరిదాసు,కళాకారులకు అర్చకులకు కళాకారుల పెన్షన్ అందించాలని, అలాగే ఒకే కులానికి చెందిన వారు రాష్ట్రంలో ప్రాంతాలవారీగా మాల దాసరి మాలదాసు మిత్త అయ్యల్వార్, మాల అయ్యవారు క్రింద 2011 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం 15 లక్షల జనాభా కలిగి ఉన్నామని ప్రస్తుతం అది 20 లక్షల జనాభా కలిగి ఉంటుందని జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కులాన్ని ఆదుకోవాలని విన్నవించుకున్నారు. 2020లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడ్డాక దాసుల కమ్యూనిటీ కార్పొరేషన్ నిమిత్తం దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిఫార్సు చేసిన లేఖలను అలాగే శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి రికమండేషన్ లెటర్ తో సహా సజ్జల గారికి చూపించి దీనిపై ప్రభుత్వం చొరవ చూపలేదని, 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాసంకల్ప యాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో హరిదాసుల వేషధారణలో కలిసి సమస్యలు విన్నవించుకున్నామని ఐదేళ్లు గడుస్తున్న దానికి పరిష్కారం చూపలేదని ఇప్పుడైనా గమనించి అన్ని కులాలకు న్యాయం చేసిన మాదిరిగానే దాసుల సంక్షేమ సంఘం వారి కులానికి కూడా సముచిత స్థానం కల్పించి గుర్తించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. తప్పనిసరిగా మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చగా పని చేస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు

Related posts

వైసీపీలోకి మారలేదని తప్పుడు కేసులతో టీడీపీ కార్యకర్తలకు వేధింపులు

TV4-24X7 News

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

TV4-24X7 News

ప్రొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి

TV4-24X7 News

Leave a Comment