Tv424x7
National

సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?

సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే.ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది.ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.మరో ఆసక్తికర విషయం ఏంటంటే, సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, గ్రహణ సమయంలో, నాలుగు నిమిషాల తొమ్మిది సెకన్లపాటు చీకట్లోకి వెళ్లనున్నాయి.గతంలో చూసిన చంద్రగ్రహణాల కన్నా ఇది ఎక్కువ సమయమే. అందుకే, ఈసారి శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.సూర్యుడితో పోలిస్తే చంద్రుడు భూమికి 400 రెట్లు దగ్గరగా ఉంటాడు. పరిమాణంలో సూర్యుడి కన్నా చంద్రుడు 400 రెట్లు చిన్నది. సూర్యుడికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడు పూర్తిగా కనిపించని స్థితే సంపూర్ణ సూర్యగ్రహణం.శాస్త్రవేత్తలకు గ్రహణ సమయాలు ఎన్నో ప్రయోగాత్మక పరిశోధనలకు ముఖ్యమైనవి.ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలో పూర్తిగా చూడొచ్చు. అమెరికా, కెనడాలలోని ప్రజలతోపాటు మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లోని వారు కూడా చూసేందుకు అవకాశం ఉంది.ఏయే ప్రయోగాలు చేయనున్నారు?వన్యప్రాణులపై గ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు నార్త్ కరోలినాలోని ఎన్‌సీ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం చేపట్టనుంది. టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న పలు జంతు ప్రదర్శన శాలల్లో 20 జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు.అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కూడా జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు ఎక్లిప్స్ సౌండ్‌స్కేప్ ప్రాజెక్ట్ రూపొందించింది.సంపూర్ణ గ్రహణ ప్రభావానికి లోనయ్యే ప్రదేశాల్లో ఉండే జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు.గ్రహణం వల్ల ఏర్పడే చీకటిలో అవి ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు వీలుగా వాటి సమీపంలో మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేయనున్నారు.అవి మాత్రమే కాకుండా, నాసా మూడు సౌండింగ్ రాకెట్ల ప్రయోగానికి సిద్ధమైంది. గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రదేశానికి దూరంగా, వర్జీనియాలోని నాసా బేస్‌ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించనుంది.ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీకి చెందిన అరోహ్ బర్జాత్యా ఈ ప్రయోగానికి సారథ్యం వహిస్తున్నారు.ఈ రాకెట్లు గ్రహణ సమయంలో భూ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను రికార్డు చేయనున్నాయి.ఈ రాకెట్లు భూ ఉపరితలం నుంచి 420 కిలోమీటర్ల ఎత్తు వరకు దూసుకువెళ్లి, తిరిగి నేలను తాకుతాయి.మొదటి రాకెట్‌ను గ్రహణం ప్రారంభం కావడానికి 45 నిమిషాల ముందు, రెండో రాకెట్‌ను గ్రహణం ఏర్పడిన సమయంలో, మూడో రాకెట్‌ను గ్రహణం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత ప్రయోగిస్తారు.భూ ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పొరను ఐనోస్పియర్ అని పిలుస్తాం. ఈ పొరలో అయాన్‌లు, ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.రేడియోతరంగాలు భూ వాతావరణంలోకి ప్రవేశించకుండా ఈ పొర అడ్డుకుంటుంది. ఇది అంతరిక్షాన్ని, భూ వాతావరణాన్ని వేరు చేస్తుంది.గ్రహణం వల్ల ఈ పొరలో చోటుచేసుకునే మార్పులను అధ్యయనం చేయడంలో ఈ సౌండింగ్ రాకెట్ల ప్రయోగం కీలకం కానుంది.గ్రహణాల వల్ల కలిగే మార్పుల అధ్యయనానికి ఇది మంచి అవకాశం. అంతేకాక, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో కూడా తెలుస్తుంది.ఫోటోలు పంపాలని ప్రజలను కోరిన నాసాఈ ప్రయోగాలే కాకుండా నాసా ఎక్లిప్స్ మెగామూవీ అనే మరో ఆసక్తికర ప్రయోగాన్ని కూడా చేపట్టనుంది.ఈ ప్రయోగం కోసం నాసా, గ్రహణాన్ని వీక్షించేవారికి ఓ విజ్ఞప్తి చేసింది. గ్రహణం ఏర్పడినప్పుడు ఫోటోలు తీసి, తమకు పంపాలని కోరింది. అలా ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చే ఫోటోలన్నింటినీ కలిపి, కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో విశ్లేషణ చేయనుంది.ఈ ఫొటోలతో సూర్యుడి కరోనాకు సంబంధించి మరింత వివరంగా తెలుస్తుంది.కరోనా అంటే సూర్యుడి చుట్టూ పలు రకాల వాయువులతో ఏర్పడిన వాతావరణం.సాధారణంగా సూర్యుడిపై ఉండే తీవ్రమైన కాంతి వల్ల ఈ కరోనా కనిపించదు. దానిని చూసేందుకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. అయితే, గ్రహణాల సమయంలో దీనిని సులభంగా చూడొచ్చు. అంతేకాదు, సూర్యుడికి అతి సమీపంలో ఉన్న నక్షత్రాలను కూడా చూడొచ్చు.ఈ ఫోటోల ద్వారా వాటిపై కూడా అధ్యయనం చేయడం ఈ ప్రయోగంలో మరో ముఖ్య లక్ష్యం.నాసాకు చెందిన హై ఆల్టిట్యూడ్ రీసర్చ్ విమానాలు 50 వేల అడుగుల నుంచి గ్రహణానికి సంబంధించిన ఫోటోలను తీయనున్నాయి.మెక్సికో మొదలుకొని గ్రహణం కొనసాగే సమయాల్లో ఇవి ప్రయాణిస్తూ ఫోటోలు తీస్తాయి. ఈ విమానాల్లో మరికొన్ని పరికరాలు ఉంటాయి.600 బెలూన్లు ఆకాశంలోకి..గ్రహణ సమయంలో భూ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను రికార్డు చేసే లక్ష్యంతో ది ఎక్లిప్స్ బెలూన్ ప్రాజెక్ట్ రూపొందించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా 600 బెలూన్లను భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి వదులుతారు. 35 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లే ఈ బెలూన్లకు అమర్చిన పరికరాలు వాతావరణంలో చోటుచేసుకునే పలు మార్పులను రికార్డు చేయనున్నాయి.నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సోలార్ ఆర్బిటర్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ కూడా ఈ గ్రహణంపై అధ్యయనం చేయనున్నాయి.గత ప్రయోగాలతో ఏం తెలుసుకున్నారు?ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగాలు, అధ్యయనాలన్నీ గతంలో గ్రహణ సమయాల్లో నిర్వహించిన ప్రయోగాలు, అధ్యయనాల వల్లే సాధ్యమయ్యాయి. వాటి వల్ల చాలా ముఖ్యమైన, చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణలు జరిగాయి.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాన్ని 1999 మే 19న ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో తీసిన చిత్రం సహాయంతో నిరూపించారు ఆర్థర్ ఎడ్డింగ్‌టన్.1868లో సూర్య గ్రహణాన్ని రికార్డు చేస్తున్న సమయంలోనే హీలియం (He) మూలకాన్ని కనుగొన్నారు.చంద్ర గ్రహణ సమయంలో భూమిపై ఏర్పడిన నీడను ఆధారంగా చేసుకుని భూమి బల్లపరుపుగా లేదని, గుండ్రంగా ఉందని నిరూపించారు అరిస్టాటిల్‌.

Related posts

100 ఏళ్ల పెళ్లికొడుకు.. 102 ఏళ్ల పెళ్లి కూతురు.. పదేళ్ల నుంచి రిలేషన్షిప్‌లో.

TV4-24X7 News

తల్లి పాలతో వ్యాపారం.. వేలల్లో ఆదాయం దర్యాప్తులో కీలక విషయాలు లభ్యం..

TV4-24X7 News

జొమాటోకు షాక్.. రూ. 803 కోట్ల జీఎస్‌టీ కట్టాలని నోటీసులు

TV4-24X7 News

Leave a Comment