Tv424x7
AndhrapradeshCrime News

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Crime: కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల (Elections) వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ (Gun) కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి..హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం (Land dispute) ఉంది. ఆక్రమణదారులు, ఓ రిటైర్డ్ పోలీసు అధికారి, మరికొందరు పొలం దగ్గరకు వచ్చి పంచాయతీ చేసుకోవాలని గన్‌తో బెదిరించారని (Crime) బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే పోలీసులు కేవలం ఆక్రమణదారులపైనే కేసు నమోదు చేశారని, తమను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ అధికారి, ఆయనతోపాటు గన్ పట్టుకొని వచ్చిన వ్యక్తిపైన పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపించారు. కాగా ఎన్నికల నేపథ్యంలో గన్ లైసెన్స్ ఉన్న వారు తుపాకీని స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి… అయితే రిటైర్డ్ పోలీస్ అధికారితో పాటు వచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన గన్‌కు లైసెన్స్ ఉందా?… లేదా అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు..

Related posts

అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం

TV4-24X7 News

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త..

TV4-24X7 News

కొత్త వ్యక్తులు గ్రామాలలోకి వస్తే సమాచారం ఇవ్వండి

TV4-24X7 News

Leave a Comment