Tv424x7
Crime NewsTelangana

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

Drugs: హైదరాబాద్‌: నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Police) సీజ్ (Siege) చేశారు..4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ (OCB) ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో యువకులు డ్రగ్స్ వినియోగించి.. మత్తులో మునిగారు. గోవా (Goa) నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సనత్ నగర్ పోలీసులు ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్‌తో పాటు 5 మొబైల్స్ సీజ్ చేశారు..మరోవైపు దుండిగల్ పీఎస్ పరిధిలో మేడ్చెల్ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఒరిస్సాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. రూ. 33,750 విలువ గల 1.35 కేజీల గంజాయిని సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బుల సంపాదన ఆశతో గంజాయి దందా చేస్తున్నారు. ఒడిస్సాకు చెందిన కార్మికులు రూ. 7 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 15 వేలకు విక్రయాలు చేస్తున్నారు. ఈ ఘటనలో రంజాన్ దాస్, కేశవ్ కౌర్, కె.గంగా ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు..

Related posts

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు

TV4-24X7 News

సీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు

TV4-24X7 News

కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం.. గ్రామాలకు గ్రామాలే ఖాళీ!

TV4-24X7 News

Leave a Comment