కర్నూలు జిల్లా….మహాత్మా జ్యోతిభాపూలే 197 వ జయంతి సందర్భంగా యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూలు నందలి స్థానిక బి క్యాంపులో గల *మన వృద్దుల ఆశ్రమంలో* వయో వృద్దులకు ఉదయం అల్పాహారం ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, బిసి జనసభ నాయకులు శేషఫణి, ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ నాయకులు ఖధీరుల్లా, రిటైర్ డి.యస్.పి జయచంద్ర, విద్యార్థి సంఘం నాయకులు భరత్ కుమార్ ఎరుకలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, భూపాల్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి మహిళా ఐక్య వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు అకుతోట పద్మావతి, లక్ష్మీదేవి, లక్ష్మేశ్వరి, రాధిక, మనీషా వృద్ధాశ్రమం నిర్వాహకులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post