Tv424x7
Telangana

కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష :నిర్వహించిన రామకోటి సంస్థ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం భద్రాచల దేవస్థాన పిలుపు మేరకు గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం కోటి తలంబ్రాల దీక్షను వాడ వాడలా ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు .గురువారం నాడు కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గోటి తలంబ్రాల కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు గారు భక్తులకు గోటి తలంబ్రాల (వడ్లు) అందజేసి 3గంటల పాటు రామనామ స్మరణ చెపిస్తూ గోటితో ఓడ్లను ఒలిపించి తలంబ్రాలు తయారు చేయించారు. ఈ తలంబ్రాల్లే సీతారాముల కళ్యాణానికి ఉపయోగిస్తారన్నారు.గోటి తలంబ్రాల తయారుచేసి భక్తులు మాట్లాడుతూ ఇంతటి మహా భాగ్యం మాకు కలిగించి మమ్మల్ని కూడా భద్రాచల సీతారాముల కల్యాణంలో వాడే తలంబ్రాలు మాచే తయారు చేయించి భాగస్వాములను చేయించినందుకు రామకోటి రామరాజుకు కృతజ్ఞతలు6 తెలిపారు.ఈ కార్యక్రమంలో కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు సిద్ది భిక్షపతి, దూభకుంట మెట్రాములు, కాపర్తి వైకుంఠ, మర్యాల శ్రీనివాస్, దూబకుంట ప్రభాకర్ పాల్గొన్నారు.

Related posts

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

TV4-24X7 News

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

TV4-24X7 News

గృహజ్యోతి దరఖాస్తుల్లో లోపాల సవరణకు అవకాశం

TV4-24X7 News

Leave a Comment