ముదినేపల్లి: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్ పైపులైన్ లీకైంది. ప్రధాన రహదారి వెంబడి లీకవడం.. సమీపంలో వేసిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇటీవల పెరికెగూడెం నుంచి డోకిపర్రు వరకు కేవలం రెండు అడుగుల లోతులోనే పైపు లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు..
