అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి లపై విషం చిమ్ముతున్న షర్మిల, సునీత. వై.ఎస్.వివేకా కేసు కోసం ఖర్చు చేస్తున్న కోట్ల డబ్బు ఎక్కడిది.నర్రెడ్డి సునీత సభల్లో మాట్లాడుతూ సీబీఐ ని ప్రభావితం చేస్తారా?విరుచకపడ్డ వైసిపి నేత రెడ్యo.ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పై రాయి తో దాడి చేయించింది కాక డ్రామాలoటారా? నారా చంద్రబాబు నాయుడు అండ్ కో మాట్లాడ టానికి సిగ్గు ఉండాలని వైఎస్ఆర్సిపి నేత, ఏపీ ఎస్ ఆర్ టి సి మాజీ జోనల్ చైర్మన్ రెడ్యo వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దుంపలగట్టులోని వారి స్వగృహంలో మంగళవారం రెడ్యo విలేకరులతో మాట్లాడుతూ.. డ్రామాలు అంటున్న వారు రాళ్లతో కొట్టించుకోగలరా? కత్తితో పొడిపించుకోగలరా? అంటూ రెడ్యo సవాల్ విసిరారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శంకర్ రెడ్డి లపై సునీత షర్మిలలు ప్రతి సమావేశంలో విషo చిమ్ముతున్నారని , వై.ఎస్ వివేకా కేసు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని? ఖర్చు చేసి వివేకం సినిమా తీసి జగన్,. అవినాష్ లను నీచంగా కించపరిచారని వీటి వెనుక డబ్బు ఖర్చు చేసింది చంద్ర బాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కాదా అని అని రెడ్యo నిలదీశారు. షర్మిల కోసం ప్రత్యేక విమానమును సమకూర్చిo ది చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ఎంపీ సీఎం రమేష్ నాయుడు కాదా? ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్ పై గాని, వైఎస్ అవినాష్ పై గాని సునీత షర్మిల లు విమర్శలు చేయడం ఆకాశం పై ఉమ్మి వేయడమేనని రెడ్యo ద్వజమెత్తారు. నర్రెడ్డి సునీత, షర్మిల లు సభల్లో అసత్యాలు మాట్లాడుతూ సీబీఐ ని ప్రభావితం చేస్తారా? కోర్టు లో ఉన్న అంశం పై సభల్లో మాట్లాడుతుంటే కోర్ట్ లు, సీబీఐ ఏం చేస్తుందని ప్రశ్నిస్తూ.. సీబీఐ, కోర్ట్ లు సునీత షర్మిల లపై చర్యలు తీసుకోవాలని రెడ్యo డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం తెదేపా తో కుమ్మకై షర్మిల,సునీత లు వై. ఎస్ అవినాష్ రెడ్డి పై ఎన్ని విమర్శలు చేసినా షర్మిల కు డిపాజిట్ కూడా దక్కదన్నారు. కడిగిన ముత్యంలా, తెల్ల పేపర్ లా అవినాష్ బయట కు వస్తారని రెడ్యo తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశం లో వైసిపీ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు

previous post
next post