కడప :వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి కడపలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివేకా హత్యపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డిలపై విరుచుకుపట్టారు. వివేకా హంతకులను జగన్ వెనకేసుకస్తున్నారని ఇప్పటికే ఆరోపిస్తున్న సునీత, హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివేకా హత్యకు గల కారణాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటకే కడప పార్లమెంటు నియోజకవర్గాల్లోవిస్తృతంగా షర్మిల, సునీత ప్రచారం నిర్వహిస్తూ అవినాష్‌రెడ్డి, జగన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చిన్నాన్నను చంపించిన అవినాష్‌రెడ్డి ఓవైపు న్యాయం కోసం పోరాడుతున్న తాము మరోవైపు ఉన్నామని, ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుంచి షర్మిల బస్సుయాత్రకు భారీగానే స్పందన వస్తోంది. ఇంతటితో ఆగకుండా కడప పార్లమెంటు పరిధిలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అవినాష్‌రెడ్డిని ఢీ కొట్టాలంటే ఇతర పార్టీల మద్దతు అవసరమని భావించిన వివేకా కుమార్తె సునీత రాజకీయ పార్టీల ముఖ్య నాయకులను కలుస్తున్నారు.

previous post