వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ నోటీసులిచ్చింది.కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు.

previous post