జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నేడు ప్రచారం చేయనున్నారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం ప్రారంభం కానున్న రోడ్ షో.. వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.మరో వైపు ఖమ్మంలో రఘురాంరెడ్డి, కైకలూరులో కామినేని శ్రీనివాస్ తరఫున హీరో వెంకటేశ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
