ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డి.శ్రీనివాస్ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు.మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా.. బాల్కనీలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు.
వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు ఉన్నాయని.. వాళ్ల గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ ఇటీవల ఆస్పత్రి పెట్టారు.
నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో ఆయనే కుటుంబాన్ని హతమార్చి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.