Tv424x7
Andhrapradesh

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం.. మరో రెండు రోజులు వర్షాలు..

భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Related posts

సూరాడా సత్తయ్య 2వ వర్ధంతి కార్యక్రమం

TV4-24X7 News

కందుల ఆధ్వర్యంలో కళ్లద్దాలు పంపిణీ మహిళ కార్యకర్తలకు చీరల పంపిణీ

TV4-24X7 News

ఆ ఉద్యోగులను గుర్తించేందుకు టీటీడీ కొత్త ఆలోచన. వర్కవుట్ అవుతుందా!*

TV4-24X7 News

Leave a Comment