*కడప, మే 12 : ప్రజాస్వామ్య పండుగలో భాగంగా మే 13న జరిగే ఎన్నికల ఓటింగ్ కార్యక్రమంలో మీ కుటుంబంలోని ఓటర్లందరూ.. తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆహ్వానం పలికారు. ఓటు హక్కును పొందిన వారంతా.. తమతమ నియోజకవర్గాల్లో ఓటు కార్డు కలిగిన పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గం౹౹ నుండి సాయంత్రం 6 ౹౹ లోపు ఓటు వేసేందుకు తరలిరావాలని ఓటర్లను ఆయన ఆహ్వానించారు. ఎన్నికల కమీషన్ ఆమోదించిన ఫోటో గుర్తింపు కార్డులలో ఏదోఒక దానిని వెంట తీసుకెళ్లి.. తమ అమూల్యమైన, విలువైన ఓటుహక్కును బాధ్యతగా సద్వినియోగించుకుని ప్రజాస్వామ్య దేశంలో పటిష్టమైన నాయకులను ఎన్నుకోవాలన్నారు. గత సాధారణ ఎన్నికల కన్నా ఈ సారి అధిక శాతం ఓటింగ్ నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

previous post
next post