తాడేపల్లి:మహిళా వాలంటరీ పై విచక్షణ రహితంగా దాడి చేసి దుర్భాషలాడుతూ బట్టలు చింపిన వైనం* తాడేపల్లి క్రిస్టియన్ పేటకు చెందిన ఒక మహిళ వాలంటీర్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీ ప్రభుత్వం రావడానికి సంఘీభావంగా తన వాలంటరీ బాధ్యతకు రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది అని అక్రోషంతో స్థానికంగా ఉన్న టిడిపి కార్యకర్త వాలంటరీ ఇంటి వద్దకు వెళ్లి మహిళా అని ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి దుర్భాషలాడుతూ నువ్వు కృష్టియన్ పేటలో ప్రచారం చేస్తున్నావ్ నీ పేరు రెడ్ బుక్కులో ఉందని వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు నీ అంత తేలుస్తా, ఇప్పుడు నీకు దిక్కున వారికి చెప్పుకో పో అంటూ బెదిరించాడు. దిక్కు తోచని ఆ మహిళ వాలంటీర్ 100 కి డయల్ చేసి స్థానిక పోలీస్ వారిని ఆశ్రయించి నాకు భర్త కూడా లేడు, వృద్ధులైన నా అత్త మామ వద్దనే ఉంటున్నానని నాకు తెలుగుదేశం పార్టీ వారి అండదండతో నా మీద దాడి చేశారని వారి నుండి నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి అని వేడుకుంది.*దీనిపై పోలీసువారు ఏ రకంగా స్పందిస్తారో???
