కడప /ప్రొద్దుటూరు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ , అనునాయలు కానీ , అనవసరంగా ఘర్షణలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ హెచ్చరించారు…జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికల మేరకు ట్రబుల్ మాంగర్సును పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని , ఇందులో అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు తప్ప ఒక పార్టీకి సంబంధించిన వారిని చేయడం లేదన్నది రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలన్నారు…ప్రొద్దుటూరులో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కౌంటింగ్ పూర్తి అయ్యేంతవరకు ఈ చర్య కొనసాగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఘర్షణలు పడవద్దని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు…తెలిసి చేస్తే శిక్ష పడుతుందని తెలియక చేస్తే తప్పని హెచ్చరిస్తామని చెప్పారు…ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి మీడియాతో మాట్లాడారు… కార్యక్రమంలో వన్టౌన్ సిఐ శ్రీకాంత్ , 3 టౌన్ సిఐ వెంకటరమణ ,ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు…

previous post