Tv424x7
National

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లా లోఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది ఆదివాసీలు మృతి చెందారు. తునికాకు సేకరణ కోసం వెళ్లిన ఆదివాసీలు ప్రయా ణిస్తున్న వ్యాను వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలో పడింది. ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నారని స్థానికులు తెలిపారు. అందరూ తునికాకు సేకరణ ముగించుకొని తిరిగి సెమ్హార గ్రామం వస్తున్న సమయం లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కవర్థ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మృతి చెందిన వారిలో 14 మంది మహిళలు, నలుగు రు పురుషులు ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజరు శర్మ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలి పారు. మృతుల కుటుం బాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు…

Related posts

ఎలాన్ మాస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

TV4-24X7 News

గుడ్‌న్యూస్.. తగ్గనున్న పెట్రోెల్, డీజిల్ ధరలు!

TV4-24X7 News

నేడు కోయంబేడులో విజయకాంత్‌ అంత్యక్రియలు

TV4-24X7 News

Leave a Comment