ఏలూరు జిల్లా : కైకలూరు నియోజకవర్గం : మండవల్లి మండలం :తరగతి గదిలో విద్యార్థిని పై అత్యాచారం.వీడియో తీసిన నలుగురు యువకులు**బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుల అరెస్టు.మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేం దుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్ లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా..బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు
పోలిసుల వివరణ మండవల్లి మండలంలో ఇటీ వల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15న మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవ డంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మాటువేసిన సహ విద్యార్థి.. బాలికను తరగతి గది లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.ఆ సంఘటనను బాలసుబ్రహ్మణ్యం(22), చంద్రశేఖర్(22), తేజ(19), హరికృష్ణ(20) వీడియో తీశారు. అనంతరం బాలికకు వీడియో చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులనూ బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తామని వారు ప్రాధేయపడినా.. వారు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. దాంతోపాటు వీడియోను వాట్సప్ – గ్రూపుల్లో పెట్టడంతో.. బాలిక తల్లి పోలీసులను ఆశ్ర యించారు. కైకలూరు గ్రామీణ సీఐ కృష్ణకుమార్, మండవల్లి ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జునైల్ హోమ్కు తరలించారు. బాధితురాలిని వేధింపులకు గురిచేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ.. న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.