పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మొదలైంది. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ‘ట్విటర్ వీడియో ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారు? అది మార్ఫింగ్ వీడియో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు EVM ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసరే అన్నారు. FIRలో కూడా ఇదే ఉంది. అరెస్టుపై ఈసీ నేరుగా ఆదేశాలివ్వడం సరికాదు’ అని పేర్కొన్నారు.

previous post
next post