బెంగళూరు : బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు గురువారం వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. వీరిలో తెలుగు సినీ నటి హేమ, యువ నటి ఆశూ రాయ్ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. విచారణకు హాజరు కావాలని వారందరికీ తాఖీదులు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. పార్టీ జరిగిన ఫాంహౌస్ నుంచి 15.45 గ్రాముల ఎండీఎంఏ బిళ్లలు, 6.2 గ్రాముల కొకైన్, ఆరు గ్రాముల హైడ్రో గంజాయితో పాటు సెల్‌ఫోన్లు, కార్లు సీజ్ చేసినట్లు తెలిపారు…..

previous post
next post