అయిజ పట్టణానికి సమీపంలోని కట్టకింది తిమ్మప్ప దేవాలయం నుంచి సిక్స్ వే వరకు ఉన్న గుంతలకు మట్టి తరలించి ఉదారతను చాటుకున్న పోలీసులు.బీటీ రహదారిపై మోకాటి లోతు గుంతలు పడటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని ఎస్సై విజయభాస్కర్ గుంతలకు మట్టి తరలించడంతో పాటు జెసిబి సహాయంతో చదును చేయించారు. బీటీ రోడ్డు రెన్యువల్ చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఎస్సై గుంతలకు మట్టిని తరలించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోయినా పోలీస్ శాఖ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గుంతలకు మట్టి తరలించడంతో ఎస్సై, సిబ్బందికి వాహన చోదకులు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు…
