.అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.మే 28న ఎన్టీఆర్ 101 జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం నాయకులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు..

previous post
next post