ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం విచారణ చేపట్టనున్నారు. ఈకేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు..కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు నిన్న వాదనలు వినిపించారు. ఈడి, సీబీఐ ఇవాళ వాదనలు వినిపించనున్నారు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తానన్నారు. నిన్న కవిత భర్త అనిల్ విచారణకు హాజరయ్యారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారన్నారు. బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని జడ్జి ప్రశ్నించారు..

next post