దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.కౌంటింగ్ ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గ దర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను వేగంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు.జూన్ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని సూచించారు.జూన్ 4న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో కొన్ని చోట్ల ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక

previous post