విశాఖపట్నం గొప్ప మానవతా వాది,మంచి మహా మనిషి,దర్శక నిర్మాత మీ,మా అందరి అభిమాన హీరో ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా 29వ వార్డ్ జిల్లా పరిషత్ అమెరికన్ ఓల్టేజ్ హోం లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్ధి, కాబోయే శాసనసభ్యులు అన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి ఓల్టేజ్ హోం లో గల వృద్దులకు పాలు,పండ్లు,రొట్టెలు వితరణ చేశారు.ఈ సందర్భంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సుమారు 350 పైగా చిత్రాలలో కథానాయకుడిగా అంతేకాకుండా రాజకీయాలలో కూడా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రను వేసుకున్నారని, తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమను,ఆయన కుటుంబ సభ్యులను మన అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్లిపోవడం,మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలుగు చిత్ర పరిశ్రమ వున్నంత వరకు ఆయన గుర్తులు పదిలంగానే వుంటుంది అని అన్నారు,తండ్రికి మించిన తనయుడిగా ఘట్టమనేని మహేశ్ బాబు కూడా చిన్న పిల్లలు గుండె ఆపరేషన్ ల విషయం లో గొప్ప ఉదారత చాటుకుంటున్నారు అని, భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబానికి మరింత శక్తిని ఇచ్చి ప్రజలకు మరియు చిన్న పిల్లలకు మరింత సేవా చేసే అవకాశం కల్పించాలని అన్నారుసిటీ వైడ్ కృష్ణ &మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, 29వ వార్డ్ జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా సూపర్ స్టార్ కృష్ణ అభిమాని గా పుట్టడం ఎంతో ఆనందంగా వుంది అని అని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఆయన జ్ఞాపకాలు గుర్తులు తలవని రోజు లేదు,తెలుగు చిత్ర పరిశ్రమకి ఎనలేని కృషి చేసిన దర్శక,నిర్మాత, నటదీరుడు,చిత్ర పరిశ్రమ సింహాసనం పై కూర్చున్న మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ చిత్రసీమలో చెక్కు చెదరని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ ఎలాంటి పాత్రలోనైనా ఆయన ఒదిగిపోయేవారు,ఆయన నిజ జీవితంలో కూడా సూపర్ స్టారే,అసాధ్యమైన నటనా పటిమ తో నాటి కుర్రకారును ఉర్రూతలూగించి. అశేషమైన అభిమానాన్ని సంపాదించిన సూపర్ స్టార్ కృష్ణ మరణం అత్యంత బాధాకరం. తండ్రి వలె గొప్ప మానవతా విలువలు కలిగి వున్న గొప్ప నటుడు మహేష్ బాబు మరియు ఆయన కుమార్తె వయసులో చిన్న అయినప్పటికీ గొప్ప మనసు గల వారని చిన్న వయసు నుండే ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తనకి వచ్చిన పారితోషకాన్ని పిల్లలకు అందించడం చూస్తే కుటుంబ వారసత్వంగా తమ సేవా భావాన్ని అలవరుచుకున్నారని,మహేష్ బాబు ఎంతో మంది చిన్న పిల్లలు గుండె ఆపరేషన్ లు చేయించి ప్రాణలని కాపాడుతున్నారని.మంచి వ్యక్తులకు మంచి వారే పుడతారు అన్న నానుడి ఘట్టమనేని కుటుంబానికే దక్కుతుంది అని,అటువంటి మహనీయుని స్ఫూర్తిని మన భావి తరాలకు తెలియజేసేవిధంగా ప్రతి ఏడాది ఘనంగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుతామని అన్నారు.

previous post