Tv424x7
National

దేశ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు సగటున 5% పెరగనున్నాయి.

చౌటుప్పల్‌ : ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు జూన్‌ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. చివరి విడత పోలింగ్‌ జూన్‌ 1న ముగియడంతో టోల్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.  

విజయవాడ హైవేపై..హైదరాబాద్‌-విజయవాడ (65) జాతీయ రహదారిపై  జీఎంఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.35, భారీ రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా కలిపి రూ.50 వరకు పెంచారు. స్థానికుల నెలవారీ పాస్‌ రూ.330 నుంచి రూ. 340కి పెంచారు. 

Related posts

బ్రహ్మోస్’ దెబ్బకు పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేదు: ప్రధాని మోదీ

TV4-24X7 News

MEILకు NPCL నుంచి భారీ కాంట్రాక్టు

TV4-24X7 News

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

TV4-24X7 News

Leave a Comment