Tv424x7
Andhrapradesh

వైసీపీ ఓడితే : పార్టీలో చీలిక ఖాయం.. టాప్ లీడ‌ర్లు జంప్‌…!

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎవ‌రు గెలిచినా.. ఒక పార్టీనే అధికారంలోకి వ‌స్తుంది. ఒక నాయ‌కుడే ముఖ్య‌మంత్రి అవుతారు. అయితే.. గెలిచే పార్టీ ప‌రిస్థి తి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఓడిపోయే పార్టీ ప‌రిస్థితి మాత్రం అత్యంత దారుణంగాఉండ‌నుంది. ఒక‌వేళ ఆ ఓడిపోయే పార్టీ వైసీపీ అయితే.. ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌. ఈ విష‌యాన్ని చూస్తే.. వైసీపీ కనుక పోతే.. ఆ పార్టి ఇప్పుడున్న‌బ‌లంగా అయితే.. ఉండే ప‌రిస్థితి లేదు.కార‌ణాలు ఏవైనా కానీ.. పార్టీ నాయ‌కులు చీలి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆర్థిక స‌వాళ్ల‌ను అధిగ‌మిం చేందుకు .. లేదా.. కేసుల నుంచి త‌మ‌ను తాము కాపాడుకునేందుకు వైసీపీ నాయ‌కులుక్యూ క‌ట్టిన‌ట్టు గెలిచిన పార్టీలోకి జంప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. 2018లో పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేశారు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేద‌ని మెజారిటీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.గెల‌వ‌ని వారు.. వెళ్లిపోవ‌డం ఖాయం. ఎందుకంటే.. వారిపై కేసులు పెడ‌తారు.. లేదా.. అక్ర‌మాల‌ను వెలికి తీస్తారు. దీనిలో సందేహం లేదు. దీంతో అధికార పార్టీ ఒత్తిడినిత‌ట్టుకోలేక‌.. గెల‌వ‌ని వారు పార్టీ మారిపోవ‌డం ఖాయం. ఇక‌, గెలిచిన వారు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దికోస‌మైనా.. లేక‌.. వారు కూడా.. వేధింపులుత ట్టుకోలేక‌.. ఇవ‌న్నీ కాక‌పోయినా.. ఇత‌ర కార‌ణాల‌తోనో .. వైసీపీని వ‌దిలేయ‌డం ఖ‌చ్చిత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.దీంతో వైసీపీ రెండు గా చీలిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. కొంద‌రు టీడీపీలోకి.. మ‌రికొంద‌రు జ‌న‌సేన‌లోకి వెళ్లిపోయినా.. సందేహం లేద‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ వైపు.. వృద్ధ బ్యాచ్ చూసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ సానుభూతిప‌రులు.. వైసీపీ నాయ‌కులుగా మారిన నేప‌థ్యంలో రేపు జ‌గ‌న్ క‌నుక అధికారంలోకి రాక‌పోతే.. అటు వైపు వెళ్లి.. వైఎస్ ష‌ర్మిల‌ను వైఎస్ వార‌సురాలిగా భావించే అవ‌కాశం కూడా మెండుగానే ఉంద‌ని అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరమ్మతులకు నోచని వాహనాలు…

TV4-24X7 News

రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ, కలెక్టర్

TV4-24X7 News

Leave a Comment