విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని అగ్రపథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శివాజీపాలెంలోని ఆయన స్వగృహంలో సోమవారం కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి దంపతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు నిత్యం ప్రజలతోనే ఉంటామని, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తామన్నారు. కల్యాణ మండపాలు, రైతుబజార్ నిర్మాణాలు చేపడతామని, పోర్టు యాజమాన్యంతో మాట్లాడి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. వెంకటేశ్వరమెట్ట వంటి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడతామన్నారు. వైసీపీ అధ: పాతాళానికి వెళ్లిపోవడా నికి సజ్జల, ధనుంజయ రెడ్డి లాంటి వారే కారణమని, సీనియర్లు బొత్స వంటి నేతలుండగా జగన్ వారినే సంప్రదించేవారని గుర్తు చేశారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్కడ ఏర్పాటు చేసిన ముళ్లకంచెను తొలగిస్తామన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీపై తమకు నిత్యం ఫిర్యాదులందుతున్నాయని, వాటిపైనా దృష్టి సారిస్తామన్నారు. మేయర్ పదవిని కూటమి పార్టీలు సొంతం చేసుకుంటాయా అన్న మీడియా ప్రశ్నకు వంశీకృష్ణ సమాధానిమిస్తూ తినబోయేదానికి రుచిచూడడమెందుకంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడడమే తన ధ్యేయమన్నారు.

previous post
next post