ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. షాకిచ్చిన తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రులు షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రత్నాకర్ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే మమత ఇల్లు దాటి వెళ్లాలి. ప్రేమ పెళ్లి చేసుకుందని రగిలిపోతున్న మమత తల్లిదండ్రులు రత్నాకర్ ఇంటి వెళ్లే దారిలో ఏకంగా గోడ కట్టేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

previous post
next post