ఏపీ :కర్నూలులోని ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఏంట్రాలజి వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు, రంగు దారాలు కనిపించడంతో ఆస్పత్రిలోని సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని మూడు వరుసల్లో పెట్టారు. ఆసుపత్రిలో ఉన్న రోగికి నయం కావాలని ఈపూజలు చేశారా, ఎవరికైనా చెడు జరగాలని చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
