చిలకలగూడ పిఎస్ పరిధిలో గురువారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకమీదట ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావొద్దన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనుదీప్ వారికి పలు సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లకు ఎస్ హెచ్ ఓ వార్నింగ్ ఇచ్చారు.

previous post
next post