ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు తీసుకువాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు.2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల కోసం దుల్హన్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద మైనార్టీలకు చెందిన యువతికి వివాహ సమయంలో రూ.50వేలు ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే పథకం కింద రూ.లక్ష అందజేస్తోంది.పథకానికి అర్హతలు వివాహం చేసుకోబయే తేదీకి ఒక నెలరోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వధువు మైనార్టీ వర్గానికి చెందడంతోపాటు ఏపీలో నివసిస్తున్న వ్యక్తి అవ్వాలి. వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండాలి. వధువు తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షల్లోపు, గ్రామాల్లో రూ.1.50 లక్షల్లోపు ఉండాలి.ఏమేం కావాలి.. ఎలా చేయాలంటే.. వధువు, వరుడి జన్మదిన సర్టిఫికెట్లు, ఇద్దరి ఆధార్ కార్డులు, లేటెస్ట్ ఫొటోలు, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, వివాహ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, వివాహ ఆహ్వాన పత్రం( శుభలేఖ), నివాస ధ్రువీకరణ పత్రం, ఇద్దరి బ్యాంకు ఖాతాల వివరాలు, వాటి ఐఎఫ్ఎస్ సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్, బ్యాంకు శాఖ పేరు అందించాలి. వరుడు, వధువు ఫొటోలు, ఇద్దరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, శుభలేఖ, వయసు ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.అలాగే స్కాన్ చేసిన పత్రాలు సైజ్ తక్కువలో తక్కువగా 50 కేబీ నుంచి 150 కేబీ వరకు ఉండాలి. వెబ్ సైట్ ప్రారంభం కాగానే ప్రభుత్వం పోర్టల్ తెరవబోతోంది. ఆ తర్వాత ఈ పథకం అమల్లోకి రానుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత స్థానిక తహశీల్దార్ కు వీటిని పంపించాలి. ఆయన మైనార్టీల సంక్షేమ అధికారికి వాటిని పంపిస్తారు. అందుకు వారం రోజుల సమయం తీసుకుంటారు. తర్వాత జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆన్ లైన్ లో డబ్బులు ఇస్తారు. వివాహానికి పదిరోజులు ముందుగా వధువు ఖాతాలో జమవుతుంది.

next post