విశాఖపట్నం ప్రజలు ప్లాస్టిక్,ఇతర చెత్త వ్యర్దాలను కాలువలు,గెడ్డల్లో వేయకుండా పరిశుభ్రతకు సహకరించాలని జీవీఎంసీ 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు కోరారు. వార్డు పరిధి శ్రీహర్స్ జంక్షన్ వద్ద ఎస్ఎల్ కెనాల్ లో వ్యర్ధాలు పేరుకుపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తున్న సహచారం తెలుసుకుని పారిశుధ్య సిబ్బందితో దగ్గర ఉండి పూడిక తీయించి సమస్య పరిష్కరించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత మూడురోజులుగా పడుతున్న వర్షాలకు వార్డులో ఉన్న ప్రధాన కాలువల్లో ప్లాస్టిక్,ఇతర చెత్త వ్యర్ధాలతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందన్నారు.స్థానికులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నవెంటనే సమస్య పరిష్కరించామన్నారు.వార్డు ప్రజలు చెత్త వ్యర్ధాలను కాలువల్లో వేయకుండా,మురుగు తొట్టెలలో వేయాలని లేదా పారిశుధ్య సిబ్బందికి అప్పగించాలని కోరారు.ఆయన వెంట పలువురు వార్డు నాయకులు,కార్యకర్తలు పాలొన్నారు.

previous post