వైయస్సార్ జిల్లా:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించు కొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ ఆర్ ఘాటు వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళు లర్పించారు. సోమవారం ఉదయాన్నే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూల మాలలు వేసి నివాళులర్పిం చిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణు లు ఘాట్ వద్దకు చేరుకున్నా రు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి వారికి అభివా దం చేస్తూ, అందరిని ఆప్యా యంగా పలుకరించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజ యమ్మ కంటతడి పెట్టారు. జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యాంతమయ్యా రు. జగన్ తల్లి విజయమ్మ ను ఓదార్చారు..*చిన్నారికి నామకరణం చేసిన జగన్..*వైఎస్ఆర్ జయంతి సంద ర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభి మానులు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మహిళా కార్యకర్త బిడ్డకు జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టారు. మూడు నెలల చిన్నారికి తన తల్లి పేరు కలిసి వచ్చేలా విజయశ్రీ అని నామకరణం చేశారు. అనంతరం పాప తండ్రి మాట్లాడుతూ.. తన రెండోసంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, పేరు పెట్టమని జగన్ మోహన్ రెడ్డిని కోరానని, విజయశ్రీ అని తన బిడ్డకు నామకరణం చేశారని పాప తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు..

previous post
next post