విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ టీ .డి .పి . ఇంచార్జ్ సీతం రాజు. సుధాకర్ ని వివేకానంద సంస్థ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ వివేకానంద సంస్థ వారు గోషా ఆస్పత్రిలో దూర ప్రాంతాల నుండి వచ్చిన పేషంట్ల సహాయకులకు ప్రతిరోజు భోజనాలను అందించడం చాలా అభినందనీయమని, అలాగే వివేకానంద సంస్థ నందు నిత్యం అన్నదానాలు నిర్వహిస్తూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వివేకానంద సంస్థ వారిని అభినందించారు, అలాగే వివేకానంద సంస్థకు తమ సహాయం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు పి . ఈశ్వరరావు,యూ . ఎల్లాజీ మరియు కనక మహా లక్ష్మి పాల్గొన్నారు.

previous post