దువ్వూరులోని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, జగదీష్ మాట్లాడుతూ దువ్వూరు మండలం గుడిపాడు లో ఉన్న ఆదర్శ పాఠశాల యజమాన్యం కు 10 వ తరగతికి గుర్తింపు లేకపోయినా గత ఆరు సంవత్సరాల నుండి 10వ తరగతి వరకు గుర్తింపు ఉంది అని తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థులను చేర్చుకొని వేరే స్కూల్లో 10వ తరగతి అడ్మిషన్లను చేర్పించి ఆదర్శ స్కూల్ పేరు మీద మార్కులు వచ్చాయని ప్రచారం చేస్తున్న యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలి అంతేకాకుండా ఆదర్శ పాఠశాల రేకుల షెడ్డులో తరగతులు నిర్వహించబడుతున్నాయి ఆట స్థలం కూడా లేదు స్కూలుకు ఎదురుగా బావి ఉంది ఏలాంటి రక్షణ చర్యలు కూడా స్కూల్ యాజమాన్యం తీసుకోలేదు , స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు కానీ వారితో చదువు చెప్పించడం జరుగుతుంది , ఆదర్శ పాఠశాలలో సరైన మౌలిక వసతులు కూడా లేకుండా నిర్వహిస్తున్న స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి,పదవ తరగతిలో తమ స్కూల్ పేరు మీద మంచి ఫలితాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు దీని ఇలాంటి అక్రమంగా అన్యాయంగా గుర్తింపు లేకపోయినా నడుపుతున్న యజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను అడ్మిషన్లు చేసుకుంటూ అధికారులను సైతం మోసం చేస్తున్న యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ఆదర్శ పాఠశాల యాజమాన్యం 1998 డీఎస్సీలో ప్రభుత్వ ఉద్యోగం పొంది ఆదర్శ పాఠశాల కరస్పాండెంట్ గా కరపత్రాలలో ముద్రించి వాటిని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఉపాధ్యాయుడిపైన అధికారుల సమగ్ర విచారణ జరిపి అతని విధుల నుండి తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆదర్శ పాఠశాలకు 8వ తరగతి 9వ తరగతి రెన్యువల్స్ కాకపోయినప్పటికీ విద్యార్థులను చేర్చుకొని వారిని కూడా మోసం చేస్తున్న యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు
