విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ టీ .డి .పి . ఇంచార్జ్ సీతం రాజు. సుధాకర్ ముఖ్యఅతిథిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గోవులకు అరటి పండ్లను పెట్టి, గోమాతకు నమస్కారం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, వివేకానంద సంస్థ వారు నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు, గోషా ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు ప్రతిరోజు భోజనాలు అందించడం, ఇలా పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వారిని, సంస్థ సభ్యులను ఆయన అభినందిస్తూ, సంస్థకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉరుకూటి. నారాయణరావు, 39 వ వార్డు ప్రెసిడెంట్ దానేష్, మైలి పిల్లి .శ్రీను,టీ . సాయి బలరాం, మరియు సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ ముఖ్య సభ్యులు బి . గజపతి స్వామి, అప్పలకొండ, పైడిరాజు మరియు వివేకానంద సంస్థ మహిళా సభ్యులు పాల్గొన్నారు.

previous post
next post