విశాఖపట్నం 31 వ వార్డులో రాజు రత్నమ్మ తల్లి కొడుకులు ఇబ్బందులలో ఉన్నామని, మాకు సహాయం చేయాలనీ కోరగా ఆ విషయం తెలుసుకొన్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ తక్షణమే వారికి 5000/- రూపాయలు వారి ఇంటి వద్దకి వెళ్లి సహాయం చేయమని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు, ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది, ఈ సహాయ కార్యక్రమం లో విశాఖ సౌత్ జనసేన ఇంచార్జి శివప్రసాద్ రెడ్డి, 31 వ వార్డ్ అధ్యక్షురాలు కొల్లూరి రూప, అమరాపు దుర్గ తదితరులు పాల్గొన్నారు, సహాయం పొందిన రత్నమ్మ ఇటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మా ఇబ్బంది చెప్పగానే స్పందించి మాకు సహాయం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఇలాంటి నాయకునికి ఎల్లపుడు రుణపడిఉంటామని అన్నారు.
