Tv424x7
Telangana

గుడ్ న్యూస్.. నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే

తెలంగాణ టీచర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇంటర్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖలో అధ్యాపకులు, బోధ నేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది.2024, జూన్ 30 నాటికి ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్నవారు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కానున్నారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారు బదిలీకి అప్లై చేయవచ్చు. 2026 జూన్ 30/ఆలోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఉంటుంది.ఆన్లైన్ విధానంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో… నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ అలాగే గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ నిరుద్యోగులు….డిమాండ్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం… చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. నిరుద్యోగులపై లాఠీచార్జి కూడా చేస్తోంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిన్న రాత్రి సెంట్రల్ లైబ్రరీలో… విద్యార్థులపై ఇలాంటి ఛార్జ్ చేసింది రేవంత్ రెడ్డిప్రభుత్వం.

Related posts

త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

TV4-24X7 News

భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు.

TV4-24X7 News

పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment