తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 10వేల వరకు పెరగొచ్చని సమాచారం. ఈ ఏడాది 98,296 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా సీట్లను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో వెబ్ ఆప్షన్ల నమోదుకు ఇచ్చిన గడువును ఈనెల 17 వరకు పొడిగించారు.
